Sunday, June 20, 2021

Latest Posts

శ్రుతి హాసన్ డేటింగ్ పై స్పష్టత ఇచ్చిన ముద్దుగుమ్మ

shruti haasan dating

హీరోయిన్ శృతిహాసన్ ఇటీవలే రవితేజ క్రేక్ చిత్రంతో మంచి విజయం సాధించింది. అయితే ఈమె డేటింగ్ వ్యవహారం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈమె ఒక ఫారినర్ తో డేటింగ్ చేస్తుందని అందరికీ తెలిసింది. అయితే అతను ఒక డూడుల్ ఆర్టిస్ట్ అని సమాచారం. అతని పేరు శాంతను అని తెలిసింది. మొన్నటి వరకు సీక్రెట్ గా ఉంచిన ఆమె డేటింగ్ విషయం పై ఆమె స్పష్టత ఇచ్చింది.

శ్రుతి హాసన్ ఆమె ప్రేమ వ్యవహారం పై ఏమి చెప్పిందంటే, “ఇలాంటి మేటర్స్ దాచేదాన్ని కాదు నేను. గతంలో నా డేటింగ్ వ్యవహారాల్ని దాచిపెట్టాను. కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదనిపిస్తోంది. ఎందుకంటే, ఏదో ఒక టైమ్ లో నా ప్రేమ వ్యవహారాలు బయటకొస్తాయి. ప్రస్తుతానికైతే నా డేటింగ్ లైఫ్ గురించి మాట్లాడాలని లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత సీరియస్ మేటర్ కాదు.”

ప్రేమ వ్యవహారాన్ని తను దాచాల్సిన పని లేదని, అలాని పెద్దగా సెలబ్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదంటోంది శృతిహాసన్. ఈ సందర్భంగా మహిళల విషయంలో హాలీవుడ్, టాలీవుడ్ మధ్య తేడాల్ని చెప్పుకొచ్చింది. “హాలీవుడ్ లో ఓ హీరోయిన్ కి పెళ్లయిందా లేదా ఆమె తల్లయిందా అనేది అనవసరం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ మాత్రం మహిళ విషయంలో ఇవన్నీ చూస్తారు. అదే ఓ హీరో విషయంలో మాత్రం ఇవేవీ పట్టించుకోరు. ఈ పద్ధతి మారాలని నేను కోరుకుంటున్నాను.”అని తెలిపారు శ్రుతి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss