Sunday, June 20, 2021

Latest Posts

అమ్మ నాన్న విడిపోవడం సంతోషంగా అనిపించింది శ్రుతి హాసన్

Shruti Hassan Excited About Parents Divorce

తల్లిదండ్రులు కమల్ హాసన్ మరియు సారిక విడాకుల విషయం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ఆమె కుమార్తె శ్రుతి హాసన్. కమల్ హాసన్ మరియు సారిక 1988లో వివాహం చేసుకున్నారు మరియు 2004 లో విడాకులు తీసుకున్నారు.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో, శ్రుతి హాసన్ మాట్లాడుతూ, “నేను (తల్లిదండ్రులు) వారు వీడిపోవడాన్ని స్వాగతిస్తున్నాను. ఇద్దరు కలిసి జీవించలేనప్పుడు వారు విడిపోవటమే ఉత్తమం అని నేను భావిస్తాను అందుకే వారు విడిపోవడాన్ని నేను సంతోషిస్తున్నాను. అయితే వారు అద్భుతమైన తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. నేను ముఖ్యంగా నాన్నకు దగ్గరగా ఉన్నాను. నా మమ్ కూడా బాగానే ఉంది మరియు మా జీవితంలో ఆమె కూడా ఒక భాగం” అంటూ చెప్పింది.

కమల్ హాసన్ మరియు సారికకు ఇద్దరు కుమార్తెలు – శ్రుతి మరియు అక్షర హాసన్. శ్రుతి ఇటీవల వేణు శ్రీరామ్ యొక్క వకీల్ సాబ్‌లో కనిపించారు. బాలీవుడ్ హిట్ ‘పింక్’ రీమేక్ అయిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రుతి కీలక పాత్రలో నటించింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss