Tuesday, January 25, 2022

Latest Posts

ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్స్‌లోకి ఎంటరైన సింధు

Tokyo Olympics 2020 LIVE Updates

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ గ్రూప్ దశ పోటీల్లో తెలుగు తేజం పీవీ సింధు హాంకాంగ్‌ క్రీడాకారిణిని వరుస సెట్లలో ఓడించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు గ్రూఫ్‌ జెలో భాగంగా హాంకాంగ్‌కు చెందిన NY చియాంగ్తో జరిగిన రెండో మ్యాచ్‌లో 21-9, 21-16తో వరుస గేముల్లో గెలుపొంది. ఈ విజయంతో పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో స్థానం సంపాదించారు.

కాగా తొలి గేమ్‌ను 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకున్న సింధు, రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో పీవీ సింధు 6-11తో వెనుకబడడంతో టై ‍బ్రేక్‌ దారి తీసి మూడో రౌండ్‌ ఆడాల్సి వస్తుందని అంతా భావించారు. కానీ సింధు తన ప్రత్యర్థిని దెబ్బకొడుతూ వరుసగా పాయింట్లు సాధించి గ్రూప్ జే టాపర్‌గా సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

ఇది కూడా కాదవండి:  

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss