Tuesday, April 13, 2021

Latest Posts

నానిని హత్తుకున్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

Shyam Singha Roy Heroine Revealed

తాజాగా విడుదల అయిన శ్యామ్ సింగ రాయ్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. పాతకాలపు పోస్టర్ నానిని ఎప్పుడూ చూడని విధంగా ఈ పోస్టర్ వచ్చింది. నానిని వెనుక నుండి కౌగిలించుకున్న నటి ముఖాన్ని రహస్యంగా ఉంచడంతో ఇప్పుడు జనాలకు ఈ పోస్టర్ పై ఆసక్తి కలిగింది. అయితే ఈ పోస్టర్ లో ఉన్న హీరోయిన్ ఎవరా అని అభిమానుల ఆసక్తి.

పెళ్లి గెటప్ లో చేతి పై మెహెందితో నానిని కౌగిలించుకుని ఈమె ఉంది. అయితే ఆ నటి ఎవరో అని ఎదురుచూస్తున్న అభిమానులు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే. ఆమె ఎవరో కాదు ఫిదా నటి సాయి పల్లవి. సాంప్రదాయిక దుస్తులు ధరించి, పెద్ద గాజులు మరియు చేతులకు మెహెంది ధరించి, సాయి పల్లవి నానిని హత్తుకోవడంతో సరైన బెంగాలీ అమ్మాయిలా కనిపించింది సాయి పల్లవి.

ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కూడా ఉన్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మడోన్నా సెబాస్టియన్ మరో హీరోయిన్ గా చేయనుంది. ఈ చిత్రం షూట్ ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss