Monday, May 10, 2021

Latest Posts

నాని సినిమా కోసం భారీ సెట్ మరీ ఇన్ని కోట్లా

Shyam Singha Roy Movie Budget

తన హార్డ్ వర్క్ తో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కష్టపడి హీరోగా ఎదిగిన నటుడు నాని. చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలను పొందుతూ ఇప్పుడు స్టార్ హీరో గా ఎదిగాడు. ఒకప్పుడు 5-10 కోట్ల సినిమాలు చేసే నాని రూ.40-50 కోట్ల మధ్య బిజినెస్ చేసే స్థాయికి ఎదిగాడు. ఐతే తన సినిమాల బిజినెస్ పెరిగినప్పటికీ.. బడ్జెట్ల విషయంలో మాత్రం నాని జాగ్రత్త పడుతుంటాడు. సాధ్యమైనంత తక్కువ బడ్జెట్లోనే సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.

కానీ తొలిసారి నాని మాత్రం ఈ పరిమితులను దాటేస్తున్నాడు. అతడి కొత్త చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ ఏకంగా రూ.40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను ముందు సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు నిర్మించడానికి ఒప్పందం కుదిరింది. కానీ బడ్జెట్ ఎక్కువ అయిందనే కారణంతోనే ఆ సంస్థ తప్పుకుంది. ఆ స్థానంలోకి నిహారిక ఎంటర్టైన్మెంట్స్ అనే కొత్త బేనర్ వచ్చింది.

దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కోరుకున్నట్లే పెద్ద బడ్జెట్లో సినిమా చేయడానికి ఈ సంస్థ ముందుకు రావడంతో రాజీ లేకుండా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం కోల్‌కతాలో పదెకరాల స్థలం అద్దెకు తీసుకుని ఏకంగా రూ.6.5 కోట్లతో భారీ సెట్ వేయడం విశేషం. ఈ చిత్రం కొన్ని దశాబ్దాల కిందటి నేపథ్యంలో సాగుతుంది. ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్ చూస్తేనే ఇదొక వింటేజ్ మూవీ అని అర్థమవుతుంది.

అసలే పాత రోజులు, పైగా కలకత్తా నగర నేపథ్యం అనేసరికి ఆర్ట్ విభాగానికి చాలా పని పడింది. ఆధునిక పోకడలు కనిపించకుండా అప్పటి వాతావరణాన్ని తెరపైకి తేవడం కోసం ఇలా భారీ సెట్ నిర్మించారు. ఒక సెట్ కోసం ఆరున్నర కోట్లు పెట్టారంటే ఈ సినిమా స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సినిమాతో నాని 100 కోట్ల స్టార్ గా మారతాడా అనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss