Sunday, June 20, 2021

Latest Posts

షూటింగ్ ఆపిన చివరి సినిమా శ్యామ్‌ సింగరాయ్‌

Shyam Singha Roy Movie Shooting
నాని తాజా చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌. కోవిడ్ కారణంగా సినిమా షూటింగులన్నీ రద్దు అయినప్పటికీ, వివాదాల మధ్య ఈ చిత్రం షూటింగ్ కొనసాగించింది. నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఖరీదైన సెట్లు మరియు కోల్‌కతాకు చెందిన జూనియర్ కళాకారుల సంఖ్య పై చాలా పెట్టుబడులు పెట్టడంతో, వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా షూట్ కొనసాగించాలని కోరుకున్నారు.

దీనితో చిత్ర షూటింగ్ జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు షూటింగ్ అనుకోకుండా ఆపాల్సి వచ్చింది. కోవిడ్ -19 తో యూనిట్‌లోని కొందరు ముఖ్య సభ్యులు ప్రభావితం కావడంతో, షూట్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీనితో టాలీవుడ్‌లో మొత్తం అన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. షూటింగ్ ఆపిన చివరి సినిమాగా శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రం నిలిచింది. చిత్ర పరశ్రమలో ఇప్పటికే చాలా మంది వైరస్‌తో బాధపడుతున్నారు. స్టార్ హీరోస్ అంతా కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss