Sia dharam Tej Responds On Ivanka’s Good Gesture:
సోషల్ మీడియాలో ఇవాంక తాజ్ మహల్ ఫోటో మార్ఫింగ్ ట్రేండింగ్ లో ఉంది. అనేక మార్ఫింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా దీనికి సెలెబ్రిటీలు కూడా తమ టాలెంట్ ని బయట పడుతున్నారు. ఇందులో ఊడ్త పంజాబ్ ఫేమ్ దిల్ఖిత్ దోసంజ్ ఇవాంకతో దిగినట్లుగా ఫోటో ఎడిట్ చేసి సోషల్ మీడియా లో పెట్టాడు. ఈ పోస్ట్ కి స్పందించిన ఇవ్వంక ట్రంప్ “నన్ను అద్భుతమైన తాజమహల్ వద్దకు తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు. నేనెప్పటికీ మరచిపోలేని అనుభవాన్ని నాకు ఇచ్చారు” అని రీ ట్వీట్ చేశారు. దీనికి మంచి స్పందన వస్తుంది.
అలాగే ఆదిత్య చౌదరీ ఇచ్చిన రిప్లై పై కూడా ఇవాంక స్పందిస్తూ “నాకు చాలా మాది స్నేహితులు దొరికారు, భారతీయుల ఆత్మీయతను నేను మెచ్చుకుంటున్నాను” అని రిప్లై ఇచ్చారు. వీటితో పాటు ఒక కుర్రాడు సైకిల్ మీద కూర్చుని ఇవాంకను తీసుకెళ్తున్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటోకి మంచి స్పందన వస్తుంది. కాగా ఇవాంక స్పందించిన తీరు నచ్చిన సాయి ధరమ్ తేజ్ ” ఈ ట్వీట్ మీ గొప్పతనాన్ని సూపర్ సెన్స్ అఫ్ హ్యూమర్ ని తెలియచేస్తుంది. నా మాతృ భూమి తరుపున మీకు దక్కిన గౌరవం, ప్రేమ ఇవి. ధన్యవాదాలు”. అని స్పందించారు.