Wednesday, December 1, 2021

Latest Posts

ఉహించని మలుపు తిరిగిన ద్వారకా తిరుమల ఉద్యోగుల మౌన దీక్ష

Dwaraka Tirumala employees Strike

చిన తిరుములగా పేరుపొందిన ద్వారకా తిరుమలలో ఆలయ ఉద్యోగుల మౌన దీక్షలో కొత్త మలుపు తిరిగింది. ఆలయ ఏఈవో రామాచారి మృతికి నిరసనగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దీంతో ఉద్యోగులందరూ మూకుమ్మడి సెలవులు పెట్టడంతో స్వామివారి అన్నదానం, ప్రసాదాలు నిలిచిపోయాయి. కాగా ఉద్యోగులు ఈవో సుబ్బారెడ్డిని బదిలీ చేయాలని, ఈవోను బదిలీ చేసేవరకు ఇదే విధంగా మౌన దీక్షతో తమ నిరసనను తెలుపుతామని ఉద్యోగులు డిమాండ్ చేసారు. కాగా ఉద్యోగులు మౌనదీక్ష చేస్తుండగా ఏకంగా ఈవో జి.వి సుబ్బారెడ్డి ఉద్యోగులతో పాటు దీక్షలో పాల్గొన్నారు.

దీక్షలో పాల్గొన్న ఈవో జి.వి సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను మీ అందరిలో ఒకడిని, ఇదంతా మన కుటుంబం. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని పరిష్కారం చేసుకుందాం, ఏఈఓ రామ చారి మృతి చాలా బాధాకరం ప్రమాణ పూర్తిగా ఏఈఓ రామాచారిని నేను వేధింపులకు గురి చేయలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అందరం కూర్చొని పరీక్షించు కుందామని, ఆలయ ఉద్యోగులందరూ తనకు సహకరిస్తారని కోరుతున్నానని ఆలయ ఈవో జి.వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss