తూర్పు గోదావరి జిల్లాలో అంఫాన్ తుఫాన్ ఉదృతికి ఎగసిపడ్డ అలలకు తీరంలో కూలిన ఇంటి గోడ నుంచి వెండి నాణాలు బయట పడ్డాయి. కాగా భారీ అలలకు కూలిన గోడలో ఈ వెండి నాణాలు ఎలా వచ్చాయని ప్రశ్నగా మారిందా? అయితే ఇది చదవండి…. పూర్వం ఆ ఇంట్లో బొంధు అమ్మోరయ్య, ఎల్లమ్మ అనే మత్స్య కారు దంపతులు ఉండే వారని అప్పాట్లోనే వీరు ధనవంతులని ప్రచారం జరుగుతుంది.
అయితే తూఫాన్ ఉధృతికి ఎగిశపడ్డ అలల కారణంగా తీరంలోని మత్స్య కారుల ఇల్లు కూడా కోతకు గురి కాబడ్డాయి, అలా కోతకు గురి అయిన మత్స్య కారు దంపతుల ఇంటి గోడ నుంచి ఈ వెండి నాణాలు బయటపడ్డాయి. కాగా ఇవి బ్రిటిష్ కాలం నాటి వెండి నాణాలుగా గుర్తించారు. అయితే ఈ సంఘటనను అక్కడి ప్రజలు గోప్యంగా ఉంచుతున్నారు ఎందుకంటే వారికి దొరికిన ఈ వెండి నాణాలు పురావస్తు శాఖ వారు తీసుకుంటారని గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం.
ఇది కూడా చదవండి: