Sunday, June 20, 2021

Latest Posts

మరోసారి పోలీసులను ఆశ్రయించిన గాయని మధు ప్రియ

Singer Madhu Priya Filed Police Case In Cyberabad Police Station

ప్రముఖ గాయని మధు ప్రియ మరో సారి పోలీసులను ఆశ్రయించింది. ఆడ పిల్లనమ్మ నేను ఆడపిల్లను అనే పాట పాడి ఈమో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అశ్లీల, బెదిరింపు కాల్స్ వస్తున్నాయిని ఆమె ఫిర్యాదు చేసింది. మధు ప్రియ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆ నంబర్లను పోలీసులకు అందజేశారు.సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక శాఖ అయిన షీ బృందాలకు పంపారు. ఈవ్-టీజింగ్ మరియు మహిళలపై వేధింపుల నేరాలకు సంబంధించిన కేసుల పై దర్యాప్తు చేసే షీ టీం ఈ కేసుని నమోదు చేసుకుంది.

ఐపీసీ 509, 354 బి సెక్షన్లపై కేసు నమోదు చేశారు. మధు ప్రియ ఇటీవల మహేశ్ బాబు సినిమా “సరీలేరు నీకేవ్వరు” లోని “హి ఈజ్ సో క్యూట్” అనే హిట్ పాటను పాడింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss