Tuesday, January 25, 2022

Latest Posts

గుంటూరులో దారుణం విద్యుత్ఘాతంతో ఆరుగురు మృతి

Six people die of electrocution In Guntur

గుంటూరు రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో విషాదం చాయలు అలుముకున్నాయి. అర్ధరాత్రి లంకెవానిదిబ్బ రొయ్యలచెరువు వద్ద ఒక్కసారిగా విద్యుత్ఘాతం ఏర్పటంతో కరెంట్ షాక్ కొట్టి రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు మృతి చెందారు. మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేందర్, నవీన్‌గా గుర్తించారు. వీరంతా రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా పనిచేయడానికి ఒడిషా నుంచి వచ్చారు. వారు రోజూ మాదిరి రాత్రి చెరువు గట్టుపై నిద్రిస్తున్నా సమయంలో విద్యుత్ వైర్లు ప్రమాదవశాత్తు తెగిపోయాయని విశ్వసనీయంగా తెలిసింది. ఎవరో కావాలని చేసినట్టు తెలియరాలేదు అని చెప్పారు.  విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. రొయ్యల చెరువు యాజమానిని కూడా ప్రశ్నించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss