Wednesday, April 21, 2021

Latest Posts

యాదగిరిగుట్టలో అపశ్రుతి

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పునర్నిర్మాన పనులలో ఈరోజు అపశ్రుతి చోటు చేసుకుంది.  యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి పక్కనే ఉన్న మరో గుట్ట పై దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో వీవీఐపీ భక్తుల కోసం 20 వరకూ ప్రెసిడెన్షియల్ సూట్ విల్లాల నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఓ భవనానికి స్లాబ్ వేస్తుండగా సెంట్రింగ్ కూలడంతో పై నుంచి కూలీలు కింద పడ్డారు. ఊ ఘటన లో నలుగురికి తీవ్ర గాయాలయినట్టు ఇద్దరు కూలీల తలకు తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రి కి తరలించినట్టు సమచారం. ఈ ఘటనపై మరికుంత సమాచారం రావాల్సివుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss