Wednesday, April 21, 2021

Latest Posts

శ్రీహరికోటలో స్పేస్ సెంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

slight fire accident at Satish Dhawan Space Centre in Sriharikota

నెల్లూరు జిల్లా శ్రీహరి కోట స్పేస్ సెంటర్‌‌ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం)లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ ప్యానెల్ గదులు దగ్ధమయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షార్‌లోని ఘన ఇంధన మోటార్లు తయారుచేసే ఎస్‌పీపీ విభాగంలో అగ్ని ప్రమాదం సంబావించి రెండు ఎలక్ర్టికల్‌ ప్యానల్స్‌ గదులు దగ్ధమయ్యాయి అని అదికారులు చెబుతున్నారు.  ఎస్‌పీపీలోని ఏపీజీడీ-3 భవనంలో అమోనియం పెరాక్లోరైడ్‌ గ్రైండింగ్‌ చేస్తుంటారు.

బుధవారం 10 గంటలకు సిబ్బంది ప్యానల్స్‌ను ఆన్‌చేసి బయటకువెళ్లారు ఆ సమయంలో యూపీఎస్‌ నుంచి మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు.   సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు ఫైర్ సిబ్బంది రావడంతో మంటల్ని వెంటనే అదుపు చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.  చిన్న ఫైర్ యాక్సిడెంట్ కావడంతో పెద్దగా ఆస్థి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss