Wednesday, April 21, 2021

Latest Posts

రాజమండ్రి లో విషాదం…. ఉయ్యాలలో చిన్నారి మృతి

small Child Death Tragedy in Rajahmundry rular

ఉయ్యాల ఊగుతూ హాయిగా నిద్రలోకి జారు కోవలసిన పాపాయి,  ఆ ఉయ్యాలే ఉరితాడుగా మారి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌ మండలం మోరంపూడిలో జరిగింది. దీంతో అక్కడి ప్రాంత మంత తీవ్ర విషాదా ఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళ్తే మోరంపూడికి చెందిన ఒక వివాహిత భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి వేరే ఇంట్లో ఉంటుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఇంటి వరండాలో కుమార్తె ఊగేందుకు చీరతో ఉయ్యాల కట్టింది. ప్రతి రోజూలాగే రాత్రి సమయంలో ఉయ్యాలలో చిన్నారి పడుకుంది.

అయితే రాత్రి సమయంలో పాప అలికిడి లేఖ పోవడంతో తల్లికి అనుమానం వచ్చి వరండాలో ఉన్న ఉయ్యాల దగరకు వచ్చి చూసింది.  ఉయ్యాలను చూసిన ఆమె కు ఒక్క సరిగా గుండే ఆగిపోయింది. ఉయ్యాలలో హాయిగా నిద్రిస్తుంది అనుకున్న చిన్నారి, ఆదే ఉయ్యాల తిరగబడటంతో చీర కొంగుకు చిన్నారి మెడకు చుట్టుకుపోయి ఉంది. దాంతో తల్లి పాపను వెంటనే ఉయ్యాల నుంచి బయటకు తీసి చూడగా చిన్నారిలో చెలనం లేక పోవడంతో వెంటనే స్థానికుల సాయంతో హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి చెయ్ దాటడంతో చిన్నారి చనిపోయింది. బిడ్డ ఉయ్యాలలో  పడుకుందని అనుకున్నానని, ఇలా ప్రాణాలు కోల్పోతుందని అనుకోలేదని గుండె పగిలేటట్లు తల్లి  కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడ ఉన్నవారు ఆ తల్లిని చూసి వారి హృదయం చలించిది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss