Tuesday, April 13, 2021

Latest Posts

ట్రోల్స్ పై మెగాస్టార్ ఇచ్చిన స్మూత్ కౌంటర్ 

Smooth counter given by megastar chiranjeevi on trolls

ఎందరో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎప్పటి  నుంచో ఏక్టివ్ గా ఉంటున్నారు. కానీ  మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి, లేట్ గా వచ్చినా, లేటెస్ట్ అంటూ పోస్టులతో కుమ్మేస్తున్నారు.  పైగా కరోనా సమయం కూడా కావడంతో   చిరంజీవి కరెక్ట్ టైమ్‌కి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

కరోనా మహమ్మారి గురించి అవగాహన కల్పించడమే కాకుండా ‘కరోనా క్రైసిస్ చారిటి మనకోసం’ అనే సంస్థ స్థాపించి సినీ కార్మికులను ఆదుకుంటున్న విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే ఇటీవల  మెగాస్టార్‌కి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్స్, వాడే లాంగ్వేజ్ మీలాంటి సున్నితమనస్కులు తట్టుకోవడం చాలా కష్టం కదా..? అలాంటి వాటిని ఎలా స్వీకరిస్తారు? అనేది ప్రశ్న.

‘‘అవును.. నేను సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వగానే కొందరు ఫోన్ చేసి మరీ ఇదే ప్రశ్న అడిగారు. దీనికి నేను చెప్పే సమాధానం ఏమిటంటే.. నా అనుమతి లేకుండా నన్ను ఎవరూ బాధించరు. అది నా ఫిలాసఫీ. రాసుకునే వాళ్లని రాసుకోనివ్వండి. ట్రోల్ చేసుకునే వారిని చేసుకోనివ్వండి. అది వాళ్ల యొక్క నీచత్వం లేదంటే వాళ్ల క్యారెక్టర్ అది. వాళ్ల క్యారెక్టర్, వాళ్ల మెసేజ్ మూలంగా నన్ను షార్టర్ చేయలేరు. నా ఫీస్ ఆఫ్ మైండ్‌ని వాళ్లు షార్టర్ చేయలేరు. నేనెప్పుడూ ప్రశాంతంగా ఉంటుంటాను. అలాంటి వాటిని వదిలేస్తా’’ అని మెగాస్టార్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss