Sunday, June 20, 2021

Latest Posts

సన్ ఆఫ్ ఇండియా కోసం కలెక్షన్ కింగ్ తో జతకట్టిన చిరంజీవి

Son Of India Teaser Released By Hero Suriya

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా కాలం తరువాత సన్ ఆఫ్ ఇండియా అనే దేశభక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను కొన్ని నిమిషాల క్రితం తమిళ స్టార్ హీరో సూర్య విడుదల చేశారు. ట్రైలర్‌ను పంచుకుంటూ సూర్య ఇలా ట్వీట్ చేసారు, “కలెక్షన్ కింగ్” పట్ల అపారమైన గౌరవంతో, సన్ ఆఫ్ ఇండియా టీజర్ ని విడుదల చేస్తున్నాను. మాస్ట్రో ఇలైయరాజా మ్యూజికల్ !! ఆల్ ది బెస్ట్

ఈ టీజర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్‌ఓవర్‌ ఇవ్వడం హైలైట్ అని చెప్పాలి. చిరు మోహన్ బాబు యొక్క ట్రేడ్మార్క్ డైలాగ్, “నా రూటే సెపరేటు” చెప్పినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. మోహన్ బాబు ఈ చిత్రంలో వివిధ గెటప్‌లను ధరించి స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.

విజువల్స్ క్లాస్ గా కనిపిస్తున్నాయి మరియు ఇలయరాజా యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.  ముఖ్యంగా, చివరి డైలాగ్, “నేను కసక్  అయ్యానంటే మీరేందరూ ఫసక్” చాలా బాగుంది. సన్ ఆఫ్ ఇండియా లో శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ మరియు అలీ ఇతర ప్రముఖ పాత్రలలో నటించనున్నారు. దీనికి డైమండ్ రత్న బాబు దర్శకత్వం వహిస్తున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss