Sonia Gandhi gives five suggestions to Modi
కోవిడ్-19 అరికట్టేందుకు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రధాన మోడీ ఫోన్ చేయడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గారు ఐదు సూచనతో ఒక లేఖ రాశారు. ఆ లేఖలో మొదటిగా డిల్లీ లో చేబడుతున్న సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టు నిలిపివేయాలని ఆ నిధులతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని కోరారు. రెండవదిగా రెండేళ్లపాటు ప్రభుత్వం చేసే ప్రకటనలో ఒక్క కరుణ చైతన్యానికి సంబంధించిన ప్రకటనలు తప్ప మరి యై ప్రకటనలు చేయకుండా నిషేధించాలి అన్నారు. మూడవదిగా ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు జరిపే విదేశీ పర్యటనను నిలిపివేయాలని కోరారు.
పీఎం కేర్స్ వచ్చిన నిధుల మొత్తాన్ని ప్రధాని సహాయనిధికి బదిలీ చేయాలని, దీనివల్ల నిధుల వినియోగంలో పరదర్శకత మరియు జవాబుదారీతనం ఉంటాయని నాల్గవ సూచనగా తెలిపారు. ఇక ఐదవ సూచనగా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలు మినహాయించి వ్యయ బడ్జెట్లో 30 శాతం తగ్గించాలని, అలా తగ్గించిన వాటిని వలస కార్మికులకు, కార్మికులకు, రైతులకు, చిన్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థికంగా ఆదుకోవాలని తెలిపారు.