Monday, July 26, 2021

Latest Posts

బంజారా హిల్స్ లో కాస్ట్లీ హౌస్ ని కొన్న సోనూ సూద్

Sonu Sood Bought New House In Banjara Hills

ఎంతో ప్రసిద్ధి చెందిన నటుడు, కరోనా సమయంలో రియల్ హీరో అనిపించికున్నాడు నటుడు సోనూ సూద్. ఇతను ఆక్సిజన్ సరఫరా, హాస్పిటల్ పడకలు మరియు ఇతర వనరులను అందించడంలో కీలకపాత్ర పోషించడం ద్వారా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.

సోను సూద్‌ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ నటుడు హైదరాబాద్ లో ఒక ఇల్లును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అది కూడా ఫిల్మ్ సిటీ కి దగ్గరలో బంజారా హిల్స్ వద్ద. అతను చాలా కాలంగా తన సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ కి వచ్చి వెళుతూ ఉండడంతో అతను తన ఇంటిని ఇక్కడికి మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

సోను తన కొత్త ఇంటిని తన స్వచ్ఛంద ప్రయోజనాల కోసం మరియు దాతృత్వ కార్యకలాపాల కోసం ఉపయోగించాలని యోచిస్తున్నాడు. ఇక సినిమాల పరంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో వెండి తెర పై మెరవనుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss