Sunday, June 20, 2021

Latest Posts

సోనూకి అంత డబ్బులు ఇవ్వలేక సినిమా నుంచి తప్పించారు

Sonu Sood Got Rejected For This Film

సోనూ సూద్ ఒక సూపర్ హీరో ఇవి కే‌టి‌ఆర్ చెప్పిన మాటలు. ఇలాంటి కష్ట సమయాల్లో బాలీవుడ్ నటుడు సోను సూద్ చేస్తున్న సాయంతో కే‌టి‌ఆర్ ఇచ్చిన బిరుదు. అయితే సూను సూద్ ఇదే కాకుండా రియల్ హీరో అని, పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అని అంటున్నారు. తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితమైన అయిన సోను సూద్ ఇప్పుడు ఒక సినిమా అవకాశం కోల్పోయాడట.

అతను చివరిసారిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన “అల్లుడు అదర్స్” లో కనిపించాడు మరియు ఈ చిత్రం కోసం అతను రెమ్యునరేషన్ గా రూ .2.5 కోట్లు అందుకున్నాడు. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రాజెక్ట్ అఖండ కోసం బోయపాటి శ్రీను సోను సూద్ ని కలిసినప్పుడు, సోను 7 కోట్ల రూపాయిల పారితోషికం అడిగినట్లు సమాచారం. నిర్మాణ బృందం సోను సూద్‌కు అంత చెల్లించలేనందున, వారు ఈ సినిమాలో సోనూ సూద్ ని తీసుకోలేదట. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో ట్రెండింగ్ గా మారింది.

అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు కరోనావైరస్ మహమ్మారి సమయంలో అతను పేద ప్రజలకు చేస్తున్న సహాయం కోసం అయినా అతనికి ఇంత మొత్తం చెల్లించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి, కాజల్ అగర్వాల్ నటించిన ఆచార్య చిత్రంలో సోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss