sonu sood is not a villain he is a real hero in life
అరుంధతి సినిమా అంతే గుర్తుకువచ్చేది విలన్ క్యారెక్టర్. వదల బొమల్లి అంటూ ప్రేక్షకులను బయపెట్టిన సోనూ సుధ్ మనకి విలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుపరిచితుడే. ఈయన బాలీవుడ్, టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నడు. సినిమాలో అంతా క్రూరంగా కనిపించే ఆయన తన మంచి మనసు చాటుకున్నాడు. ముంబైలోని జుహూ ప్రాంతంలో హోటల్ శక్తి సాగర్‌లో సోనూసూద్ కు ఆరంతస్తుల హోటల్ వుంది. దేశం కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న వైదులకు వైద్య సిబ్బందికి తన హోటల్లో ఉండవచ్చని చెప్పారు. దేశం కోసం వారికి సాయం చేయ్దాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సోనూ సూద్ తెలిపారు. ఇప్పటికే ముంబై మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వ ప్రవేట్ హాస్పటిల్స్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోజంతా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి చిన్న సాయం చేసే అవకాశాన్ని గౌరవంగా భావిస్తున్నా. వాళ్లంతా ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి సేవ చేస్తున్నారు. వాళ్లు విశ్రాంతి తీసుకునేందుకు ఒక చోటు కావాలి. అందుకు మా హోటల్‌ను వినియోగించుకోవాలని మున్సిపల్, ప్రైవేట్ ఆసుపత్రులకు తెలిపాము’ అని సోనూసూద్ పేర్కొన్నాడు.