Sunday, June 20, 2021

Latest Posts

క్రిష్ దర్శకత్వంలో సోనూ సూద్ పాన్ ఇండియా సినిమా

Sonu Sood Krish To Combine For A Movie

సోను సూద్ గత రెండేళ్ళలో ప్రజల వద్ద ప్రేమ మరియు కీర్తిని సంపాదించాడు. కోవిడ్ లో ఆయన చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆయనకి అభిమానులని తెచ్చిపెట్టాయి. అతను ఇప్పుడు కేవలం ఒక నటుడికి మించినవాడు, అతను కీర్తి మరియు డబ్బులో చాలా పెద్ద పెద్ద సూపర్ స్టార్లను అధిగమించాడు.

అయితే అతను ఇప్పుడు చేసే సినిమాల పై ప్రజలు ఒక కన్నేసి ఉంచారు. అతను ఒక మంచి నటుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు క్రిష్ సోను సూద్‌ను హీరోగా ఒక  అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు వినికిడి. క్రిష్ దీని గురించి సోను సూద్ ని కలిసాడని మరియు సోనూ నుంచి అనుమతి కూడా పొందాడని తెలిసింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా చేయబోతున్నాడట క్రిష్.

ఇంతకుముందు వీరిద్దరూ మణికర్ణిక కోసం కలిసి పనిచేశారు, కాని ఈ చిత్రం వారిద్దరికీ ఎంత చేదు అనుభవాన్ని మిగిల్చిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు, వారు ఆ చేదు అనుభవాల్ని చరిపేస్తూ ఒక అద్భుతమైన సినిమా చేసే పనిలో పడ్డారు. అయితే సినిమా ఎలా ఉండబోతుంది ఇందులో ఎవరు నటిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss