Sunday, June 20, 2021

Latest Posts

సోనూ సూద్ పై నిందలు రెస్పాండ్ అయిన నటుడు

Sonu Sood Response To Fake Bed Troll:

బాలీవుడ్ నటుడు సోను సూద్ టాలీవుడ్‌లో విలన్ పాత్రలు చేసినందుకు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కోవిడ్ టైమ్ లో అతను రీల్ విలన్ కాస్త రియల్ హీరో అయ్యాడు. ఎందుకంటే కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ప్రజలకు సహాయం చేయడంలో ముందంజలో నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే నిరుపేదలకు నిస్వార్థంగా సహాయం అందిస్తున్నప్పటికీ సోను సూద్ పై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కొన్ని ట్రాల్స్ వస్తున్నాయి.

అయితే తాజాగా, గంజామ్ జిల్లా మేజిస్ట్రేట్ మరియు కలెక్టర్ యొక్క అధికారిక ట్విట్టర్ నుంచి సోనూ ని తప్పు పట్టే ప్రయత్నం చేసింది. తమ ఫౌండేషన్ ఆక్సిజన్ అవసరమైన వ్యక్తికి మంచం ఏర్పాటు చేయడానికి సోనూని సంప్రదించలేదని, కానీ దాని కోసం క్రెడిట్ సోనూ తీసుకున్నాడని చెప్పింది. అయితే ఆ పేషంట్ ఆరోగ్యం కుదురుగానే ఉందని ఎటువంటి ఇబ్బందులు లేదని మేము క్షేమంగానే చూసుకున్నామని తెలిపింది.

అయితే సోను సూద్ దీని పై స్పందించాడు. తాను గంజామ్ జిల్లా మేజిస్ట్రేట్ ను సంప్రదించినట్లు ఎప్పుడూ చెప్పలేదని చెప్పాడు. “సర్, మేము మిమ్మల్ని సంప్రదించినట్లు మేము ఎప్పుడూ చెప్పలేదు, అది మమ్మల్ని సంప్రదించిన వ్యక్తిది మరియు మేము అతని కోసం ఆక్సిజన్ బెడ్ ని ఏర్పాటు చేసాము, మీ పరిశీలన కోసం అతనితో జరిగిన సంభాషణను జత చేశాను. మీ కార్యాలయం గొప్పగా పని చేస్తోంది & మేము అతనికి సహాయం చేసామని మాత్రమే చెప్పాము. కావాలంటే మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేయవచ్చు.” అని సోనూ సూద్ చెప్పాడు.

అదే సమయంలో, సోను సూద్ సింగపూర్ నుండి నిధులు పొందుతున్నారని మరియు అతను పెద్దగా ప్లాన్ చేస్తున్నాడని మరిన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రజల్లో మాత్రం, ప్రభుత్వాలు కనీసం స్పందించనప్పుడు నటుడు తన వంతు సాయం చేస్తున్నాడని అలాంటి వ్యక్తి పై నిందలు మోపడం సరి కాదు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss