Tuesday, January 25, 2022

Latest Posts

హైదరబాద్ లో జ్యూస్‌ షాప్‌ నడుపుతున్న సోనూసూద్

Sonu Sood Selling Mosambi Juice

కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సాయం చేస్తు పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారిన సోనూసూద్ ఇంకా సాయం చేస్తూనే ఉన్నాడు. కొద్దిరోజుల నుంచి మరో కొత్త అవతారం అవతారమెత్తి మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్నాడు. సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం నుంచి పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం ప్రారంభించాడు. ‘సోనూసూద్ పంజాబీ ధాబా ఇక్కడ దాల్ రోటీ ఉచితమే” అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.

ఆ తర్వాత రిక్షా మీద గడ్డి తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తిని చూసి వెంటనే కారు దిగి స్వయంగా తనే రిక్షా తొక్కుకుంటూ వెళ్లాడు. ఇలా రోజుకొక చిర వ్యాపారులకు సోనూసూద్‌ అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఈసారి జ్యూస్‌ షాప్‌ ఓనర్‌గా మారిపోయి సందడి చేశాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జ్యూస్ షాపుకి వెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. ఆ షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడాడు. ఇక్కడ బత్తాయి జ్యూస్‌ ఫ్రీ అంటూ స్వయంగా జ్యూస్‌ తయారు చేసి అమ్మాడు. కొద్దిసేపు అక్కడే ఉండి చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరాడు. దానికి చెందిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఇలా తనదైన స్టైల్‌లో చిరు వ్యాపారులకు సోనూ మద్దతిస్తుండటంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇది కూడా చదవండి: 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss