Monday, May 10, 2021

Latest Posts

సోనూసూద్ సింప్లిసిటీ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Sonu Sood Simplicity

లాక్‌డౌన్‌లో వలస కార్మికులను స్వస్థలాలకు చేరవేసి రీల్ హీరో కాస్త రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్‌. కష్టాల్లో ఉన్న చాలామందికి ఆర్థిక సాయం చేస్తూ రియల్‌ హీరోగా పేరు గాంచాడు. ఇటీవల అల్లుడు అదుర్స్‌లో కనిపించిన సోనూసూద్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నాడు.

అయితే సాధారణంగా ఏ హీరో అయినా సరే కార్ లో షూటింగ్ కి వెళ్తూ ఉంటారు. కానీ ఈ రియల్ హీరో మాత్రం సినిమా సెట్స్‌కు సైకిల్‌ మీద వెళ్లాడు. హైదరాబాద్‌ రోడ్ల మీద సైకిల్‌ తొక్కుకుంటూ షూటింగ్‌కు వెళ్లిన సోనూసూద్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఇలా చేశారని ఫ్యాన్స్ అంటున్నారు.

 

 ఇలా చేస్తే అందరూ ఫిట్ గా ఉంటారని, అతడి సింప్లిసిటీకి, ఫిట్‌నెస్‌ మీద ఉన్న శ్రద్దకు హ్యాట్సాఫ్‌ చెప్తున్నారు నెటిజన్లు. ఇక ‘ఆచార్య’ మే 13న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కరోనా నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసుకునే అవకాశం ఉందంటూ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss