Sonu Sood Takes COVID Vaccine Today
పంజాబ్లోని అమృత్సర్లోని ఆసుపత్రిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ను నటుడు సోను సూద్ బుధవారం తీసుకున్నారు. టీకాలు వేయడానికి మరియు ప్రజలలో కరోనా వ్యాక్సిన్ పట్ల అవగాహనపెంచడానికి ఈ రియల్ స్టార్ “సంజీవని: ఎ షాట్ ఆఫ్ లైఫ్” సంస్థను ప్రారంభించాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే హీరోగా పేరు గడించిన సోనూ సూద్ కరోనా కష్టం నుంచి కాపాడే శక్తి తన కంటే వాక్సిన్కే ఎక్కువ ఉంది అని చెప్పడానికి బుధవారం టీకా వేయించుకున్నాడు. దేశ ప్రజలందరూ టీకా వేసుకోవడానికి ముందుకి రావాలని కోరాడు.
దీని గురించి మాట్లాడుతూ, సోను సూద్ ఇలా అన్నాడు, “నేను దీనిని ఎందుకు ప్రారంభించానంటే, టీకాలు వేసుకోవాలా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్న ప్రజలలో అవగాహన తీసుకురావడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. కుటుంబ సభ్యులు ఇంట్లో పెద్ద వారిని, అర్హత తగిన ప్రతీ వారికి వ్యాక్సిన్ వేసేలా చూడాలి. ఇది భవిష్యత్తులో మనం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ”
ఇవి కూడా చదవండి: