Monday, May 10, 2021

Latest Posts

సోనూ సూద్ కి రికార్డు స్థాయిలో ఫాలోవర్స్

Sonu Sood Twitter Followers

రియల్ స్టార్ సోనూసూద్మరో ఘనతను సాధించాడు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కాలంలో మానవత్వాన్ని చాటుకుని సగటు జీవి పట్ల రియల్‌ హీరోగా నిలిచిన సోనూసూద్‌కు సోషల్‌ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్‌ పెరిగింది. ఇప్పుడు ట్విటర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. తాజాగా ట్విట్టర్‌లో సోనూసూద్ ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్ల మార్కును అధిగమించడం విశేషం. దీంతో రియల్ హీరో అభిమానులు అతనికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.

లాక్ డౌన్ కారణంగా వేరే ప్రదేశాల్లో చిక్కుకున్న వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి వారిని సొంత ఊరికి చేరేలా సోనూసూద్‌ అందించిన సేవలు అతనికి ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టాయి. సినిమాల్లో విలన్ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించిన సోనూ రియల్ లైఫ్‏లో మాత్రం హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే సోనూసూద్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‏లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాదు ఈ చిత్రం షూటింగ్ కి సైకిల్ పై వెళుతూ అతని సింప్లిసిటీ ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss