Sourav Ganguly Heart Attack
భారత మాజీ క్రికెటర్ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మైల్డ్ హార్ట్ ఎటాక్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు.బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈ రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆయనను ఆయన ఆస్పత్రిలో చేర్పించారు.
శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీ ఒక్కసారిగా ఛాతీనొప్పితో కుప్పకూలారు. దీనితో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోల్కతాలోని వుడ్ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ సాయంత్రం వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తారని తెలుస్తోంది. ఐదుగురు డాక్టర్ల బృందం గంగూలీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించనుంది.
ఇవి కూడా చదవండి: