Wednesday, December 1, 2021

Latest Posts

కనికా కపూర్ ఉన్న హోటల్లోనే బస చేసిన సౌతాఫ్రికా టీమ్..!!

south africa team stayed in same hotel coronavirus infected Kanika Kapoor:

బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ బాలీవుడ్ సింగర్‌కు కరోనా రావడం సౌతాఫ్రికా క్రికెటర్లను కాస్త  కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళ్తే మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికా జట్టు రెండో వన్డే కోసం లక్నోకు వచ్చిన సమయం లో ఆ జట్టు కనికా కపూర్ ఉన్న హోటళ్లోనే బస చేయటం జరిగింది. ఇప్పుడు ఇదే ఆ దేశ క్రికెటర్లను కలవరపెడుతోంది.

వన్డే మ్యాచ్ కోసం దక్షిణాఫ్రికా జట్టు హోటల్‌లో ఉన్న సమయంలో ఆమె కూడా అక్కడే  ఉంది. ఇక అక్కడ జరిగిన ఓ న్యూస్‌ ఛానెల్‌ వార్షిక సమావేశంలో కూడా ఈమె పాల్గొనటం జరిగింది. అయితే అక్కడ సీసీటీవీ ఫుటేజిని పరిశీలించిన అధికారులు ఆమెతో సన్నిహితంగా ఉన్న వారి జాబితా ని తయారు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక భారత్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న సఫారీ ఆటగాళ్లను ముందస్తు చర్యల్లో భాగంగా 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆదేశించటం జరిగింది.  ఒకవేళ ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమాచారమివ్వమని సూచించినట్లు  ఆ జట్టు డాక్టర్ షుయబ్ మంజ్రా తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss