Monday, October 25, 2021

Latest Posts

ఎస్పీ బాలు ఆరోగ్యంపై చరణ్‌ ట్వీట్‌

కరోనా వైరస్‌ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఒకానొక దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్‌ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కరోనా వైరస్‌తో పోరాడుతున్న బాల సుబ్రహ్మణ్యం గారి  ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్నట్టు ఆయన తనయుడు చరణ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగానే ఉందని. ఫిజియోథెరపీ కొనసాగుతోందని తెలిపారు. ఈ మేరకు ఎస్పీ చరణ్‌ బుధవారం మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు. ఎక్మో, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స కొనసాగుతోందన్నారు. తన తండ్రికి వైద్యసేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్య బృందానికి, ఎస్పీబీ కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్న వారందరికీ చరణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss