హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలను కొంతమంది బేఖాతరు చేస్తూ అదేపనిగా రోడ్లపైకి వస్తున్నారు. పగలు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నా.. రాత్రివేళ అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కఠినంగా ఇకపై చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఉదయం, సాయంత్రపు నడకకూ అనుమతి లేదు అని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకూ ఎవరూ రోడ్లపైకి రాకూడదని ఆయన కోరారు. పగటిపూట ఐటీ, నిర్మాణ రంగాల వారికి అనుమతులు ఇచ్చిన కారణంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రాత్రి వేళలో కొంతమంది రోడ్లపైకి వస్తున్న విషయాన్ని గమనించిన సీపీ.. ఆ సమయంలో బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో రోడ్లపై తిరిగే వారిని గుర్తించడానికి పోలీసులు ప్రత్యేకంగా గస్తీ తిరగనున్నారని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: వృద్ధురాలిని చంపేసిన చిరుత