హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ నుండి రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విధులు నిర్వహింస్తు ఉన్న కొంతమంది కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా విధించిన లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో ఉండిపోయారు. తాజాగా ఏ.పీ ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులలో బాగంగా అన్నీ కార్యాలయాలను పునఃప్రారంబించడంతో హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. వాళ్లు ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి.
అయితే, ఉద్యోగుల సమస్యలను ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖద్వారా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లాగా హైదరాబాద్‌లో చిక్కుకుని ఉద్యోగులు విధులకు రాలేకపోతున్నందున, 400 మంది ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే ప్రత్యక బస్సులకు అనుమతి ఇవ్వాలని కోరారు తెలంగాణ సీఎస్‌ను కోరాగా సానుకూలంగా స్పందించి వారికి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ సచివాలయ ఉద్యోగులకు వెళ్లడానికి మార్గం సుగమం అయ్యింది.. మియాపూర్, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్ నుంచి 10 ఆర్టీసీ బస్సుల్లో ఏపీ సచివాలయ ఉద్యోగులను అమరావతికి తీసుకెళ్లనున్నారు.