Sunday, June 13, 2021

Latest Posts

సంవత్సర కాలం లో ఈ ఒక్క రోజు మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే సింహాచలం అప్పన్న ..!!

Special Story on Simhachalam Lakshminarasimha Swamy

ప్రహ్లాదుడిని మహావిష్ణువు కాపాడిన ప్రాంతం గా….సంవత్సర కాలం లో ఒకసారి మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే కలియుగ దేవుడు గా ప్రసిద్ది గాంచిన సింహాచలం అప్పన్న పురాణ గాధ మరియు ఈ పురాతన ఆలయ విశిష్టతను ఒక సారి చూద్దాం.   

ఈ సింహాచలం దివ్యక్షేత్రం స్థలపురాణం లోతుల్లోకి వెళితే లోకాలను భయకంపితుల్ని చేసిన రాక్షరాజులు, సోదరులైన హిరణ్య కశిప, హిరణ్యాక్ష సోదరుల కాలం నాటిది.హిరణ్యాక్షుడు భూమండలాన్ని ఆక్రమించుకొని హింసని ప్రజ్వలిమ్పచేసినపుడు ఆ మహావిష్ణువు వామనావతారధారిగా అవతరించి హిరణ్యాక్షుడిని వధించి భూమండలాన్ని రక్షించాడు. తన సోదరుడైన హిరణ్యాక్షుడి మరణాన్ని సహించలేని హిరణ్యకశిపుడు మహావిషునువుపై కక్ష సాధనకై బ్రహ్మ మెప్పు కొరకై కఠోర తపస్సు చేయసాగాడు.ఇంతలో బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకశిపుని కోరిక సాధ్యపడదని సెలవిచ్చాడు. హిరణ్యకశిపుడు తేరుకొని తనకు జంతువుతో గాని మనిషితో గాని, పగలు కానీ రాత్రి కాని, ఆకాశంలో కాని భూమిపై కాని మరణం లేకుండా బ్రహ్మ దేవుణ్ణి వరం కోరి పొందాడు.హిరణ్యకశిపుడు తనకు చావే లేదని గర్వితుడై, భూమండల వాసులంతా తననే పూజించాలని వేధించడం ప్రారంభించాడు. అంతే కాకుండా దేవతలను, మునులను, విష్ణు భక్తులను వేధించసాగాడు.

విధి వైచిత్రి, హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తునిగా జన్మించాడు. “నారాయణ” నామ జపంతో అనునిత్యం విష్ణు ఆరాధనలో ఉండటం హిరణ్యకసిపునికి ఆగ్రహం తెప్పించి ఎన్ని విధాల ప్రయత్నించినా ప్రహ్లాదుని విష్ణుభక్తిని కించిత్తు మార్చలేకపోతాడు.హిరణ్యకశిపుడు అసహనానికి గురై మదగజాలతో తొక్కించినా, విషసర్పాలతో మధ్యలో పడేసినా ప్రహ్లాదుడు లొంగలేదు. సరి కదా నారాయణ నామ స్మరణతో అడ్డంకుల్ని ప్రహ్లాదుడు అధిరోహించడం హిరణ్యకసుపుని అగ్రహజ్వాలల్ని మరింత రగిలించింది.చివరిగా ప్రహ్లాదుడిని సముద్రంలో తోసి అతనిపై ఓ పర్వతాన్నుంచమని తన భటులను అజ్ఞాపించాడు. భటులు ప్రహ్లాదుడిని సింహాద్రి పర్వతం పైకి ఎక్కిస్తారు. అక్కడినుండి సముద్రంలోకి ప్రహ్లాడుడిని విసిరి వేసి ఆపై సింహాద్రి పరవతాన్ని పెకిలించి అతనిపై ఉంచాలని వారి ఆలోచన. అంతలో మహావిష్ణువు సింహాద్రి కొండపైకి ఉరికి వచ్చి ప్రహ్లాదుడిని కాపాడారు.అందుచే సింహాద్రి పర్వతం ప్రహ్లాదుడిని మహావిష్ణువు కాపాడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. తన భక్తుడైన ప్రహ్లాదుని కోరికమేరకు మహావిష్ణువు, హిరణ్యకశిపుని సంహరించిన వరాహావతారం మరియు హిరణ్యాక్షుడిని సంహరించిన నృసింహావాతారముల కలబోతగా వరహనృసింహంగా అవతరించి సింహాచలం దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నారు.

ఇక ఈ సింహాచలం ఆలయ చరిత్ర చూస్తే… తన తండ్రి మరణానంతరం ప్రహ్లాడుడే వరహనరసింహ స్వామి ఉత్సవామూర్తికి తొలిగా ఆలయ నిర్మాణం చేపట్టారని, కృతయుగం ఆఖరులో ఆలయం శిధిలావస్తకు చేరుకుందని తెలుస్తోంది.అయితే తరువాతి కాలంలో రాజ పురురావ తన సతీమణి ఊర్వశితో విహారానికి గుర్రాలపై వెళ్ళగా అతను సింహాచలం దివ్యక్షేత్రం వైపు ఆకర్షితుడై… బురదలో కూరుకుపోయిన వరహనరసింహ స్వామి విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా ఆకాశవాణి స్వామి వారి నిజరూపాన్ని బయట చేయరాదని  చందనం పూత పూయాలని సంవత్సరంలో ఒకసారి వైశాఖ మాసం మూడవరోజున మాత్రమే నిజరూప దర్శనం చేయించాలని వినిపించగా రాజ పురురావ స్వామి వారి విగ్రహం పైనుంచి తొలగించిన బురద స్థానంలో చందనం పూత పూయించిన నాటి నుండి నేటి వరకు వరహనరసింహ స్వామి వారి సింహాచలం దివ్యక్షేత్రం అప్రతిహతంగా భక్తుల నీరాజనాలను అందుకొంటూనే ఉంది. అప్పట్లోనే రాజా పురురవ ఆలయాన్ని పునర్నిర్మించారని స్థలపురాణం చెపుతోంది.  ఇకపోతే స్వామి వారి నిజరూప దర్శనం ఒక్క అక్షయ తృతీయ నాడే మాత్రమే భక్తులకు లభిస్తుంది.ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు నాటి శిలాఫలకాలు ఉన్నవి. అయితే కళింగ రాజ్యాన్ని గెలుపొందిన చోళరాజు కులోత్తుంగ-1 కాలం నాటికే ఈ దివ్యక్షేత్రం ప్రముఖంగా వేలుగొందినట్లు చారిత్రిక ఆధారాలు చెపుతున్నాయి.శ్రీక్రిష్ణదేవరాలు వారు, తన సతీమణి తో కలసి స్వామి వారికీ 991 ముత్యాలను మరియు ఇతర విలువైన ఆభరణాలను సమర్పించారని ఇక్కడి శాసనాలు ద్వారా తెలుస్తుంది.

ఇక చివరిగా ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికి ఎన్నో విశిష్టతలను కలగి ఉంది. పెద్ద గోపురం, 16 స్థంబాల ముఖమండపం, వైష్ణవేటి పురాణాల ఆదరంతో హృద్యంగా చెక్కబడిన కళాకృతులు,  భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కప్పస్తంభం, విశాలమైన వరండా వేటికవే ప్రత్యేకతలను సంతరించుకున్నాయ్. ఆలయానికి ఉత్తరాన ఉన్న నాట్యమండపం మరొక ఆకర్షణ. ఈ మండపం 96 స్థంబాలను కలిగి ఉన్నది. అంతరాలయంలో మనకు కప్పస్థంభం ధర్శనమిస్తుంది. ఈ స్తంభం  నిర్మలమైన మనస్సుతో ప్రార్ధించే భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తుందని విశ్వాసం. ఈస్తంభం లోపల సంతనగోపల యంత్రం ప్రతిష్టిమ్పబదిందని అందుచే భక్తులకోరిన కోర్కెలు తీర్చే శక్తి కప్పస్తంబానికి వచ్చిందని నమ్మకం. పిల్లలు లేని జంటలు ఈ స్థంబాన్ని ఆలింగనం చేసుకొనే సంతానం కలుగుతుందని ప్రతీతి.ఇక్కడి కొండల పైనుంచి పారే గంగధార ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ వచ్చే ఈ స్వచ్చమైన జలధారా ప్రవాహం వద్ద యాత్రికులు ఎంతో విశేష నమ్మకంతో శిరస్నామాచారిస్తారు. ఇలా చేస్తే వారి రోగాలు పోయి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. అందుకే  ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని అందరూ తప్పక దర్శిచుకోవాలి.    

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss