Thursday, May 13, 2021

Latest Posts

మారుతీరావు ఆస్తులెన్నో తెలుసా – ప్రణయ్ హత్యకేసు విచారణ వాయిదా

Sravan Speaks To Media About Maruthi Rao’s Property:

కూతురు ప్రేమించి  పెళ్లిచేసుకోవడాన్ని తట్టుకోలేక అల్లుడిని హతమార్చిన కేసులో నిందితుడిగా ఉన్న  మారుతీరావు తాజాగా  ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లోశనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.  అయితే ఇతని  ఆస్తుల చిట్టా ఒక్కొక్కటి  బయటికొస్తోంది. మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తులు రూ.200 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతని వ్యాపార లావాదేవీల వ్యవహారంలోకి వెళ్తే, మొదట మారుతీరావు కిరోసిన్ డీలర్ వ్యాపారం చేశాడు. తర్వాత రైస్‌ మిల్లుల బిజినెస్.. అనంతరం వాటిని అమ్మి రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగారు.

శరణ్య గ్రీన్‌ హోమ్స్‌ పేరుతో వంద విల్లాలు విక్రయించారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఐదు ఫ్లాట్స్.. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడెంలో మరో షాపింగ్‌ మాల్ ఉన్నాయి. మారుతీరావు పేరు మీద రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మిర్యాల గూడ  బైపాస్‌లో 22 కుంటల భూమి ఉంది. మిర్యాలగూడలో సర్వే నెం.756లో ఎకరం 2 కుంటల భూమి ఉంది. అలాగే  మిర్యాలగూడలో సర్వే నెం.457లో 7 కుంటల భూమి, దామరచర్లలో 20 ఎకరాల పట్టా భూమి ఉన్నాయి.   బంధమ్, తాళ్లగడ్డ, ఈదులగూడెం, షబానగర్‌, బంగారు గడ్డలో ప్లాట్స, మారుతీరావు పేరు మీద 6 ఎకరాల 19 కుంటల భూమి, ఒక స్కూల్ ఉన్నాయి.

కాగా  మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుభాష్‌ శర్మ, అస్గర్‌ అలీ, అహ్మద్‌ భారీ, కరీం, శివ, నిజాం కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా(ఏ-1)గా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలపడంతో.. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్‌ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ అనే యువకుడిని  మారుతిరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు అప్పట్లో సంచలనం సృషించింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss