Home సినిమా వార్తలు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే హిట్టే

వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే హిట్టే

sreenu vaitla and brahmanandam

సెంటిమెంట్స్ అందరికీ ఉంటాయి. ఇక సినిమా వాళ్ళకి ఎక్కువ. తమ అభిమాన హీరో ఫలానా డైరెక్టర్ కాంబినేషన్ లో చేయాలని, ఫలానా హీరోయిన్ ఉండాలని ఫాన్స్ భావిస్తారు. హిట్ కాంబినేషన్ గా ఫీలవుతారు. అయితే సపోర్టింగ్ ఆర్టిస్టులు ఫలానా వాళ్ళు ఉంటె ఖచ్చితంగా ఆ సినిమా హిట్ కొడుతుందన్న సెంటిమెంట్ ఉండనే ఉంది. గతంలో హాస్య బ్రహ్మ జంధ్యాల సినిమాలో సుత్తి వీభద్రరావు ఉండాల్సిందే అన్నట్టు ఉండేది. అందుకే వివాహ భోజనంబు, అహనా పెళ్ళంట వంటి చిత్రాల్లో వుండే కామెడీ చూస్తే నవ్వకుండా ఎవరూ ఉండలేరు. సునీల్ ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ హిట్ అయ్యాయి. నువ్వే నువ్వే, అతడు,జల్సా, అరవింద సమేత, తాజాగా అలవైకుంఠపురంలో మూవీస్ తో ఇది రుజువైంది.

అదే రేంజ్ లో శ్రీను వైట్ల,బ్రహ్మానందం కాంబినేషన్ అనగానే భలే సూటవుతుంది. వెంకీ ,ఢీ,రెడీ, దూకుడు,బాద్షా,వంటి మూవీస్ లో బ్రహ్మానందం నటన గురించి అందరికీ తెల్సిందే. కృష్ణవంశీ ,బ్రహ్మాజీ కాంబినేషన్ కూడా ఎన్నో హిట్స్ వచ్చాయి. సింధూరం, గులాబీ, ఖడ్గం మూవీస్ లో తన నటనతో బ్రహ్మాజీ మెప్పించాడు. అలాగే మారుతి,సప్తగిరి కాంబినేషన్ కూడా క్రేజ్ ఉన్నదే. ప్రేమకథా చిత్రంలో సప్తగిరి సందడి గురించి చెప్పక్కర్లేదు. పూరి జగన్నాధ్ ,అలీ కాంబినేషన్ కూడా అదిరిపోతోంది. అందుకే పూరి డైరెక్షన్ లో వచ్చిన బద్రి, దేశముదురు, చిరుత, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అలీ ఉన్నాడు.
దర్శకుడు రామ్ గోపాల వర్మ,కాంబినేషన్ తీసుకుంటే మనీ,గోవిందా గోవిందా, సర్కార్,లాంటి మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి. శేఖర్ కమ్ముల ,కమిలిని ముఖర్జీ కాంబినేషన్ లో హ్యాపీ డేస్,ఆనంద్, గోదావరి మూవీస్ హిట్ కొట్టాయి. కృష్ణ భగవాన్ ,వంశీ కాంబినేషన్ చూస్తే,ఔను వాళ్లిద్దరూ

ఇష్టపడ్డారు,ఏప్రియల్ 1విడుదల వంటి మూవీస్ వచ్చి హిట్ సాధించాయి. శ్రీకాంత్ అడ్డాల మూవీస్ లో రావు రమేష్ ఉంటాడు. కొత్త బంగారు లోకం,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీస్ లలో కీలక పాత్ర పోషించి మెప్పించాడు. ఇక గుణశేఖర్,ప్రకాష్ రాజు కాంబినేషన్ కూడా హిట్టే. ఒక్కడు,చూడాలని ఉంది మూవీస్ లో ప్రకాష్ రాజ్ నటన అద్భుతం. తేజ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తీసుకుంటే జయం,నువ్వు నేను మూవీస్ లో నవ్వుల పువ్వులు పూస్తాయి. కొరటాల శివ, సంపత్ రాజ్ కాంబినేషన్ కూడా హిట్టే. నని, మిర్చి, శ్రీమంతుడు మూవీస్ నిరూపించాయి.

Exit mobile version