Sunday, June 20, 2021

Latest Posts

సన్ రైజర్స్ హైదరాబాద్‌ యాజమాన్యం భారీ విరాళం

SRH Donation To COVID
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్స్ లో ఒకటైన ఐపీఎల్ లో ఆడుతున్న ఎస్‌ఆర్‌హెచ్ కోవిడ్ కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది. సన్ రైజర్స్ హైదరాబాద్‌ యాజమాన్యం ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. కరోనా మహమ్మారిపై భారత్‌ సాగిస్తున్న పోరులో భాగంగా రూ. 30 కోట్లను విరాళంగా ఇవ్వనున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం ప్రకటించింది.

ఈ విషయాన్ని తెలుపుతూ ఎస్‌ఆర్‌హెచ్ యాజయమాన్యం ఇలా తెలిపింది, ‘కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా ఉండేందుకు సన్‌ టీవీ నెట్‌వర్క్‌ రూ. 30 కోట్లను విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతున్న వివిధ కార్యక్రమాలకు ఈ నిధులను ఉపయోగించనున్నాం. ఆక్సీజన్‌ సిలిండర్లు, మెడిసిన్‌ సరఫరా నిమిత్తం ఎన్జీఓలతో భాగస్వామ్యమై ముందుకు సాగుతాం.’

ఎస్‌ఆర్‌హెచ్ చేసిన ఈ భారీ విరాళానికి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇంతక ముందు కింగ్స్ పంజాబ్ టీం కూడా 7.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. అయితే ప్రస్తుతం పోస్ట్ పోన్ అయిన ఐ‌పి‌ఎల్ 2021 సీజన్ లో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్ చెత్త ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్ లో చిట్ట చివరి స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss