Sri Bharath Shocking comments on Vishakha incident:
విశాఖ ఘటనపై బాలయ్య అల్లుడు షాకింగ్ కామెంట్స్
విశాఖ పట్నం ఎయిర్ పోర్టులో టిడిపి అధినేత చంద్రబాబు ను అడ్డుకున్న నేపథ్యంలో నందమూరి బాలయ్య రెండో అల్లుడు,టీడీపీ నేత భరత్ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ ఘటన ద్వారా వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందారని ఆయన మండిపడ్డారు. మండలి రద్దు అంశం కేంద్రం పరిధిలో ఉన్నప్పుడు.. కోపం వస్తే కేంద్రంపై చూపాలని, తమపై చూపడమేంటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు రక్షణ కల్పించారని ఆరోపించారు. విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి సంకోచించే పరిస్థితి తెచ్చారని భరత్ దుయ్యబట్టారు.
అయితే మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ, విశాఖ ఎయిర్పోర్టులో చంద్రబాబును అడ్డుకున్నది ప్రజలేనని అన్నారు. వైసీపీపై చంద్రబాబు వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ప్రజల మనోభావాలు పట్టించుకోకపోతే ఇలానే ఉంటుందన్న విషయం విశాఖలో రుజువైందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారన్నారు. ఇక్కడ పర్యటించే అర్హత చంద్రబాబుకు లేదని, తాము ముందే చెప్పామని ఆయన అన్నారు.
కాగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ వైసిపి తీరుని ఎండగట్టారు. ప్రభుత్వం చంద్రబాబు ని బలవంతంగా విమానం ఎక్కించి పంపడం ద్వారా ఏదోసాధించామని అనుకుంటున్నారని అయితే ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడుల్ని కూడా ఈ ఘటన ద్వారా విశాఖ నుంచి తరిమేశారని ఆయన విమర్శించారు