గత కొంత కాలంగా సంచలనమైన వివాదాలతో సహవాసం చేస్తున్నటువంటి ప్రముఖ వివాదాల నటి శ్రీరెడ్డి మరొక సారి సరికొత్త వార్త తో మళ్ళీ తన ప్రియమైన అభిమానుల ముందుకు వచ్చింది. కాగా దీపావళి పండగ రోజున శ్రీరెడ్డి తన ఇంటిలో జరుపుకున్నటువంటి పూజా కార్యక్రమాలకు సంబందించిన వీడియో ని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ వేదిక ద్వారా పోస్టు చేశారు. అంతేకాకుండా ఆ వీడియో కి ఓక అద్భుతమైన ఉపశీర్షిక ని కూడా తనదైన రీతిలో పెట్టుకున్నారు.
ఇకపోతే ఆ ఉపశీర్షిక అనేది ప్రస్తుతానికి సంచలనాలను సృష్టిస్తుంది. ఇంతకీ అదేంటంటే… “అందరు పసుపతుల కోసం నేను సరైన పనే చేశా. నా అమాయక మహిళలు అందరికీ నేను గద్వాల అరుంధతిని” అని కామెంట్ పోస్ట్ చేశారు. కాగా శ్రీరెడ్డి పెట్టిన పూజా కార్యక్రమం వీడియోలో శ్రీరెడ్డి హారతి ఇస్తుండగా ఓ వ్యక్తి కళ్లకు అద్దుకున్నారు. అంతేకాకుండా శ్రీరెడ్డి భారీ నగలతో తెల్ల చీరని కట్టుకొని తనని తానూ అరుంధతి లో అనుష్క లాగ పోల్చుకుంది.