ఒక్క సారిగా ఉలిక్కిపడిన శ్రీకాకులం, ఒక్క సారిగా 21 కేసులతో సంచలనం. ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ ఫ్రీ జిల్లాగా ఉన్న శ్రీకాకులం ప్రస్తుతం 21 కరోనా పాసిటివ్ కేసులతో జిల్లాను కలవరపెడుతుంది. ఈ నెల 12 న తేదీన చెన్నై నుండి వచ్చిన శ్రామిక ఎక్స్ప్రెస్ లో వలస కార్మికులంతా శ్రీకాకులం చేరుకున్నారు.
వీరందరూ కిడ్నీ సమస్య ఉన్న ఉద్దానం మరియు చుట్టూ ప్రక్కల గ్రామానికి చెందిన వాళ్ళు కావడం కలవర పెడుతున్న విషయం. కాగా వీరందరిని సరబుజ్జి మండలం శాస్త్రులపేట క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరిగింది. వీరందరికి తొలుత కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ రాగా ఇప్పుడు వీరందరికి పాసిటివ్ రావడం కలవర పెడుతున్న విషయం. వీరందరిని క్వారంటైన్ సెంటర్ లో పెట్టి చికిత్స చేస్తునారు వైద్యులు.
ఇది కూడా చదవండి: 8000 మంది సిబ్బందికి షాక్ ఇచ్చిన ఏపి.ఎస్.ఆర్.టి.సి.