Monday, July 26, 2021

Latest Posts

ప్రపంచంలోగాని, దేశంలోగాని ఎక్కడైనా ఇలాంటి పాలన చూసారా

ఎస్సిఎస్టిబిసి మైనారిటీలందరికి ఈ సంక్షేమ పధకాలు అందించడంలో ప్రభుత్వం సఫలమైనదని ప్రపంచంలోగాని, దేశంలోగాని ఎక్కడైనా జరిగిందా అనేది చూసుకుని మాట్లాడండి అంటూ ప్రతిపక్షాలు పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఛీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో  మాట్లాడుతూ అయిపోయిన పెళ్లికి బజాలా అన్నట్లు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేక ప్రజలచే తిరస్కరించబడి కేవలం 23 సీట్లు ఇచ్చి చంద్రబాబు అరాచకాలు, ప్రజావ్యతిరేకపాలన మాకొద్దు అని రాష్ట్ర ప్రజలు చెప్పారు అని ఆయన పేర్కొన్నారు.

కాని చంద్రబాబు మాత్రం ఐదేళ్లు తాను గొప్ప పాలన అందించినట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని  తన ఫెయిల్యూర్స్ గురించి, ప్రజలకు ఎందుకు సరైన పాలన అందించలేకపోయానా అని ఆత్మవిమర్శ చేసుకోవడం మానేసి జూమ్ యాప్ లలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అంటూ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయసారు. జగనన్న పాలనలో ఈ ఏడాది మంచి వర్షాలు  పడి, ప్రభుత్వం రైతులకు ఏవైతే ప్రాధాన్యత ఇస్తుందో వాటి వల్ల రైతులకు మేలు జరిగి  ప్రభుత్వం సుభిక్షంగా, రైతుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss