Sunday, June 20, 2021

Latest Posts

శ్రీనివాస్ అవసరాల అసలు బండారం బయటపెట్టిన కో డైరెక్టర్

Srinivas Avasarala Real Face

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా తన మల్టీ టాలెంట్‌తో ఎన్నో సినిమాల్లో పనిచేసిన అవసరాల శ్రీనివాస్‌కి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతని కో డైరెక్టర్ మహేష్.. ఈ వీడియోను బయటపెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది. అవసరాల శ్రీనివాస్ దగ్గర గత మూడేళ్లుగా పనిచేస్తున్న మహేష్ అనే కోడైరెక్టర్‌కి అవసరాల శ్రీనివాస్‌కి మధ్య గొడవలు రావడంతో అవసరాల శ్రీనివాస్.. తన కోడైరెక్టర్‌ని తిట్టి తన ఆఫీస్‌ని నుంచి గెంటేయడంతో ఈ వివాదం జరిగింది.

అయితే అవసరాల బండారం మొత్తం బయటపెడుతూ అవసరాల రియల్ ఫేస్‌ను చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఉంగరాల జుట్టుతో చక్కగా కనిపించే అవసరాల ఈ వీడియోలో బట్టతలతో కనిపించాడు.
అయితే ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అని మహేష్‌ని బెదిరిస్తూ కనిపించారు అవసరాల. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యో అవసరాల అనవసరంగా బుక్కయ్యాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss