హైదరాబాద్: కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని అమ్ముతున్నారు. లాక్డౌన్ వల్ల 55 రోజుల పాటు విక్రయాలు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలను మళ్లీ భక్తులు పొందే అవకాశం లభించింది. లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఈ రోజు వాటి కోసం భారీగా తరలిరావడం గమనార్హం. కరోనా విజృంభణతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.