rajamouli is not exception for those criticisms
దర్శక ధీరుడు SS రాజమౌళి ఇటీవల ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆస్కార్ విన్నింగ్ మూవీ తనకు నచ్చలేదు అని అన్నారు. ఈ కొరియన్ మూవీని చూస్తూ మధ్యలోనే నిద్రపోయానని అన్నారు. “పారసైట్ ఎందుకో నాకు నచ్చలేదు ఈ సినిమా ప్రారంభంలో కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపించింది, ఆలస్యంగా రాత్రి 10 గంటలకు ఈ సినిమాను చూడడం జరిగింది. సినిమా పూర్తి అయ్యే సరికి నాకు నిద్ర వచ్చింది.” అని రాజమౌళి చెప్పారు. ఆస్కార్ అవార్డు సాధించిన సినిమాపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కొంత మంది నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేశాయి. కొంత మంది అయితే రాజమౌళి పై విమర్శలు కూడా చేశారు. తొలిసారి ఒక సెలబ్రిటీ రాజమౌళి మీద వ్యాఖ్యలు చేశారు. రాజమౌళిని కాపీ కాట్ గా అభివర్ణిస్తూ మిఠాయి డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “SS రాజమౌళి పారసైట్ సినిమా చూస్తూ SS రాజమౌళి నిద్రపోయారు. సినిమా బోరింగ్ గా ఉండడంతో నిద్రలోకి జారుకున్నారు. వాస్తవికత గౌరవం పొందడానికి అర్హత కలిగి ఉంటుందని, పారసైట్ అటువంటి మూవీ అని” ఒక బహిరంగ లేఖ రాశారు.