Sunday, June 20, 2021

Latest Posts

మహేశ్ బాబు తో రొమాన్స్ చేయనున్న ఇద్దరు హీరోయిన్లు ఎవరంటే?

SSMB28 Movie Heroine Update

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. చివరగా, వీరిద్దరూ 11 సంవత్సరాల తరువాత మళ్ళీ జతకడుతున్నారు. దీనితో, వారి తదుపరి కలయికలో వచ్చే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్‌ఎస్‌ఎమ్‌బి 28వ చిత్రం కోసం బాలీవుడ్ నటి మహేష్ బాబుతో రొమాన్స్ చేయమని పుకార్లు చెలరేగుతుండగా, ఇంతవరకు ఏ నటిని ధృవీకరించలేదు చిత్రబృందం.

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లు అవసరం అట. ఈ చిత్రం డ్రామాతో పాటు యాక్షన్ మరియు కామెడీతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతుంది. త్రివిక్రమ్ యొక్క ట్రేడ్మార్క్ డైలాగులు ఈ సినిమాలో బాగుంటాయని తెలుస్తుంది.

త్రివిక్రమ్ కథతో మహేష్ ని మెప్పించాడని అందుకే పరశురం దర్శకత్వం వహించిన సర్కారు వారీ పాట  చిత్రం జరుగుతుండగానే రెండు చిత్రాలని ఏకకాలంలో చేయాలని నిర్ణయించుకున్నాడు మహేశ్. అయితే ఈ సినిమాలో దిషా పటాని హీరోయిన్ గా చేస్తుందని ఆమెతో పాటు పూజ హెగ్డే ఇంకో హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. అయితే ఈ సినిమాలో మహేశ్ తో ఎవరు రొమాన్స్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి కారణంగా చిత్ర షూటింగ్ ఆగిపోయింది. అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మహేశ్ తిరిగి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss