Saturday, May 15, 2021

Latest Posts

ప్రారంభమైన రైల్వే టిక్కెట్ల బుకింగ్

దాదాపు 40రోజుల తర్వాత IRCTC ద్వారా ప్యాసింజర్ రైళ్లకు బుకింగ్ ప్రారంభమయింది.  ఒక వైపు కరోనా విజృంభిస్తూ  రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. అయితే ప్రజల ఇబ్బందుల దృష్ట్యా లాక్ డౌన్ సడలింపులతో రేపటినుంచి రైలు సర్వీసులు ప్రారంబించడానికి కేంద్రం నిన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈరోజు సాయంత్రం 4గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యి. కానీ అధికమైన రద్దీ కారణంగా ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్ సైట్ irctc.co.in ఓపెన్ కావడం లేదు. టిక్కెట్ బుకింగ్ కేవలం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉండటం, స్టేషన్లలో టిక్కెట్ బుకింగ్ కౌంటర్లు లేనందువల్ల అందరూ   ఒకే సారి ఐ‌ఆర్‌సి‌టి‌సి వెబ్ సైట్ ఓపెన్ చేయడం వల్ల అధిక తాకిడికి గురవ్వడంతో అది కొంచం నెమ్మదిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే రైల్వే శాఖ రైల్వే స్టేషన్ లలో  ప్లాట్ ఫామ్ టికెట్లతో సహా ఎలాంటి టిక్కెట్లు జారీ చేయబడవు అని తెలిపింది అలాగే  IRCTC ద్వారా బుకింగ్ చేసుకున్నా కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తారు. కరోనా లక్షణాలు లేని ప్రయాణీకులు, ఫేస్ మాస్క్ ధరించడం, ప్రయాణానికి ముందు స్క్రీనింగ్ వంటి కొన్ని షరతులను రైల్వేశాఖ అవలంబించనుంది.

ఇది కూడా చదవండి: ఏ‌పిలో మొదలుకానున్న ఆర్‌టి‌సి సర్విస్ బస్ నమూనా

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss