state governments to open liquor stores in Green and Orange zones
లాక్ డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులగా వైన్ షాప్ లు బందు కావడంతో మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కొంత మందికి మద్యం పడితే గాని రోజు గడవని వారు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు. కొంత మందికి అయితే మద్యం తాగక పిచ్చిగా ప్రవర్తించిన వాళ్లు ఉన్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా లిక్కర్ షాపులు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూశారు. కాగా రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చునని రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. దాంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేవు.
దీంతో కొన్ని రాష్ట్రాలలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు ఈ రోజు ఓపెన్ చేశారు. కాగా మద్యం షాప్ ఓపెన్ చేసే క్రమంలో కర్నాటక కోలూరు జిల్లాలో ఓ ఆసక్తి కరమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం షాపుకు పూజలు చేసి, కొబ్బరికాయకొట్టి, హారతులిచ్చాడు ఓ మందుబాబు. వైన్స్ షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా మద్యం దుకాణాలను శానిటైజ్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు మద్యం షాపు యజమానులు.