state governments to pressure center to allow liquor sales
కరోనా మహమ్మారి వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగిస్తుంది. దాని వల్ల దేశంలో ఆర్దిక మార్గాలన్నీ మూసుకు పోయాయి. ఈ నేపథ్యంలో రోజు రోజుకు ఆర్ధిక వ్యవస్థ దిగజారిపోతోంది. వ్యాపారలావాదేవీలు కుదేలవుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది మద్యం విక్రయాలు. రాష్ట్రాలకు ఎక్కువగా ఆదాయాలు వచ్చే మార్గాలలో ఇది ప్రదమమైనది. లాక్ డౌన్ వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోవడం కాదు అసలు ఆదాయం లేకుండా అయ్యింది.
కాగా కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో మద్యం విక్రయాలు అనుమతివ్వాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలంటు రాష్ట్ర ప్రభుత్వాలను భారత కంపెనీల సమస్య సి.ఐ.ఎ.బి.సి కోరింది. లాక్ డౌన్ వల్ల మద్యం విక్రయాలు నిలిచిపోవడంతో రాష్ట్రాలు దాదాపు 20 కోట్ల ఆదాయాన్ని కోల్పోయాయని సీఎంలకు ఈ మేరకు లేఖ రాస్తూ గుర్తు చేసింది. సామాజిక దూరం పాటిస్తూనే విక్రయాలు చేస్తామని మద్యం దుకాణాల వద్ద రద్దీ నివారించేందుకు ఆన్ లైన్ విక్రయాలు ప్రారంభిస్తామని లేఖలో తెలిపారు.