Monday, April 19, 2021

Latest Posts

స్టీవ్ స్మిత్ నువ్వు ఇంకా మారలేదా?

Steve Smith Scuffing Video

ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకున్నంత చెడ్డ పేరు ఇంకెవ్వరికీ ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యర్థులను మాటలతో దూషించడం, ఏదో ఒక విధంగా ప్రత్యర్ధి టీం ని అవుట్ చేయాలని ఏది పడితే అది చేస్తుంటారు. అందుకు క్రికెట్ రూల్స్ కి అతిక్రమంగా చేస్తుంటారు.

కొన్నేళ్ల కిందటే బాల్ టాంపరింగ్ వివాదం ఆ జట్టును ఎంతగా కుదేలు చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తప్పుడు చర్యలో ప్రధాన పాత్రధారిగా ఉండి ఏడాది నిషేధం కూడా ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ మారిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. చివరికి వరల్డ్ కప్ లో సైతం ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు దూషిస్తూ ఉంటే కోహ్లీ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అలాంటిది ఇప్పుడు అతను టీం ఇండియా పైనే మరో పరువు తక్కువ పని చేశాడు.

ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అయ్యింది. సిడ్నీలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టులో భారత్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ చెలరేగి ఆడి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఐతే
ఈ సమయంలో ఏం చేయాలో పాలుపోని ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ గార్డ్ మార్క్స్‌ను షూలతో చెరిపేశాడు. తర్వాత పంత్ వచ్చి మళ్లీ గార్డ్ మార్క్స్‌ పెట్టుకోవాల్సి వచ్చింది.

స్టంప్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యం కామెంటేటర్ల దృష్టిలో పడి స్మిత్‌ పై విమర్శలు గుప్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క తోక ఎప్పటికీ వంకరే అని అది ఎంత మార్చిన మారదని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss