Sunday, February 28, 2021

Latest Posts

చతికిల పడ్డ స్టాక్ మార్కెట్

వరుసగా మూడు రోజుల లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. లాక్ డౌన్ లో ఆర్ధికంగా దెబ్బ తిన్న దేశాన్ని ఆదుకోవాలని కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ పాకేజ్ ను ప్రవేశపెట్టింది. దాంతో ఒక్క సరిగా ఊపందుకున్న స్టాక్ మార్కెట్స్ మళ్ళీ ఇవాళ ఆర్.బి.ఐ ఇచ్చిన ప్రకటనతో ఒక్క సరిగా కుప్పకూలాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 260 పాయింట్లు నష్టపోయి 30,672కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 9,039 వద్ద స్థిరపడింది.

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించటంతో పాటు టర్మ్ లోన్లపై మారిటోరియంను మరో మూడు నెలలపాటు పొడిగించటంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని కొంతమంది ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఈ ఉదయం కొద్దిపాటి లాభాల్లో మొదలైన సెన్సెక్స్ ఆర్బీఐ ప్రకటనతో నష్టాల్లోకి వెళ్ళినట్లు వారు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss