Sub-Registrar Offices open
లాక్ డౌన్ కారణంగా దాదాపు నెల రోజులకు పైగా ఏపీలో మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే గ్రీన్ జోన్స్ లో మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన ప్రభుత్వం.. కేంద్రం మార్గదర్శకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం మద్యం అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు మాస్కలు ధరించాలని, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వం సూచించింది. ఉద్యోగుల హాజరు కోసం ఉపయోగించే బయోమెట్రిక్ యంత్రాలను ప్రతి రోజు శానిటైజ్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగించాలని ఆదేశించింది.అలాగే రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఫస్ట్ ఇన్ ఫాస్ట్ ఔట్ ప్రకారం రిజిస్ట్రేషన్లు చెయ్యాలని రిజిస్ట్రార్లకు సూచించింది.