Wednesday, October 21, 2020

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

స్వామి ట్వీట్ తో ఆర్టికల్ 360 ప్రయోగిస్తారా

subramanian swamy tweeted Article 360 :

చైనా నుంచి మొదలై ప్రపంచమంతటా విస్తరించి, ప్రాణాంతక మహమ్మారి గా మారిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. ఇది ఎటు పౌతుందో తెలీయని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు కేంద్రం ఆర్థిక ఎమెర్జెన్సీ ప్రకటిస్తుందా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అవకాశం కల్పించే ఆర్టికల్ 360ని ఆశ్రయించడమే మార్గమని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఊహాగానా లొస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఎవరూ ఇప్పటి వరకు ఆర్టికల్ 360 ఊసెత్తకపోయినప్పటికీ కొందరు నేతల వ్యాఖ్యలతో దీనిపై విశేష ఆసక్తి నెలకొంది.

ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించేందుకు రాష్ట్రపతికి అధికారమిచ్చే చట్టమే ఆర్టికల్ 360. దీనివలన రాష్ట్రాలు తమ ఆర్ధిక వనరులను ఎలా ఉపయోగించాలో ఆదేశించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కూడా కేంద్రానికి అధికారం వచ్చేస్తుంది. ‘‘దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వానికి, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉందని రాష్ట్రపతి భావిస్తే, అధికారిక ప్రకటన ద్వారా ఆయన దీన్ని అమల్లోకి తేవచ్చు’’ అని ఈ చట్టంలోని 1వ ప్రకరణం చెబుతోందట. ఒక వేళ ఆర్టికల్ 360ని అమల్లోకి తీసుకొస్తే ఆ తర్వాతి రెండు నెలల వరకు లేదా రాష్ట్రపతి దీన్ని రద్దు చేసినట్టు ప్రకటించే వరకు చెల్లుబాటు లో ఉంటుంది. 2 నెలలకు మించి పొడిగిస్తే, దీన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించాలి.

ప్రత్యేకించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణియన్ స్వామి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో ఇది ఒక్కసారిగా తెరమీదికి వచ్చింది. ‘‘ఇక ఇప్పుడు దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించడం అనివార్యమా? ప్రభుత్వం దీనిపై సందేహాలను నివృత్తి చేయాలి..’’ అని స్వామి ఇటీవల ట్వీట్ చేశారు. స్వామి మాటలు అటుంచితే, భారత సెక్యురిటీ మార్కెట్లు ఇవాళ ఘోరంగా పతనం కావడంతో ఇక ఆర్టికల్ 360 విధించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 3,934 పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 25,981 వద్ద క్లోజ్ అయ్యింది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ సైతం 76 పైసలకు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం దీనికి కారణం.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ప్రముఖ హీరోకి కరోనా పాజిటివ్

ఈ మహమ్మారి కరోనా వైరస్ సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది...

పీవీ సింధు ఫైర్

అవాస్తవ ప్రచారాలపై బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫైర్ అయ్యారు. ఇలాంటివి ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. పీవీ సింధు తల్లిదండ్రులతో గొడవపడి వెళ్లిపోయిందని మీడియాలో ఇటీవల వార్తలు...

సీఎం రిలీఫ్ పండ్ కి సినీ ప్రముఖుల విరాళం

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. దీంతో నగరంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుకోవడంతో జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. నగర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీటిలో...

విషమంగా నాయిని ఆరోగ్య పరిస్థితి

తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు తదితరులు మంగళవారం పరామర్శించారు. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి...